పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్ర
Actor ProfilePolitician

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్ర
Oneindia Telugu19 Jul 2026
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్ర

అంతర్జాతీయ రాజకీయాలను షేక్ చేసే ఓ సంచలన దౌత్యపరమైన వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరాన్ శాంతి చర్చల కోసం వెళ్లి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆయనతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పూర్తిగా హతమార్చడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఓ రహస్య కుట్ర పన్నిందని బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ నిపుణుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందని.. ఇందులో భాగంగా జరిగిన చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ హత్యాయత్నానికి ఆదేశాలు ఇచ్చారంటూ ఆయన పేర్కొన్నారు.మరియో నౌఫల్ అనే ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్ నిర్వహించిన అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌లో పెపే ఎస్కోబార్ ఈ విషయాలను సవివరంగా వెల్లడించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వంటి అగ్రనేతలు హాజరైన పాకిస్థాన్ అవగాహన ఒప్పందం తదుపరి దౌత్యపరమైన చర్చల సందర్భంగా ఈ కుట్రకు వ్యూహం రచించబడింది. అయితే పాకిస్థాన్‌పై సైనిక నిఘా వర్గాలు ఈ అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని ముందే పసిగట్టి అడ్డుకున్నాయని ఎస్కోబార్ వెల్లడించారు. ఈ కుట్ర విషయం తెలిసిన వెంటనే పాకిస్థాన్ తీవ్రంగా స్పందించిందని.. ఓమన్ వంటి దౌత్య మధ్యవర్తుల ద్వారా నేరుహా ఇజ్రాయెల్‌కు కఠినమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు. తమ ప్రతినిధి బృందానికి గనుక ఏ మాత్రం హాని తలపెట్టినా.. తాము ఊరుకునేది లేదని.. ఇజ్రాయెల్‌ను వరల్డ్ మ్యాప్ నుంచే పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అని పాకిస్థాన్ నేరుగా హెచ్చరించిందని ఎస్కోబార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఈ సంచలణ ఆరోపణలు అంతర్జాతీయ మీడియాలో తీవ్ర దుమారం రేపినప్పటికీ.. పాకిస్థాన్ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు, ఉన్నతస్థాయి భద్రతాధికారులు ఈ కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. ప్రముఖ పాక్ జర్నలిస్ట్ కమ్రాన్ ఖాన్ ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ.. ఇవి కేవలం చెత్త