పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండి
Actor ProfilePolitician

పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండి
AP7AM1 Sept 2026
పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్లో కీలక మార్పులు.. అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు తెలుసుకోండి

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ (విత్‌డ్రా) నిబంధనలను సవరిస్తూ 'ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 2026'ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే, ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. ఉద్యోగి, యాజమాన్యం వాటాలు రెండింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.ఈ కొత్త నియమం ప్రకారం విత్‌డ్రాకు అందుబాటులో ఉండే మొత్తాన్ని లెక్కించే ముందు ఈ కనీస బ్యాలెన్స్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒకరి ఖాతాలో రూ.1 లక్ష అర్హత మొత్తం ఉంటే, అందులో రూ.25,000 కనీస బ్యాలెన్స్‌గా ఉంచి, మిగిలిన రూ.75,000 నుంచే పథకం నిబంధనలకు లోబడి విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 25 శాతం తప్పనిసరి బ్యాలెన్స్‌ను తీసివేయగా మిగిలిన మొత్తాన్నే 'అర్హత ఉన్న సభ్యుని బ్యాలెన్స్' (Eligible Member Balance)గా ఈపీఎఫ్ఓ నిర్వచించింది.విత్‌డ్రా కారణాలు.. కొత్త సేవలుకొత్త పథకం కింద పాక్షిక విత్‌డ్రాలకు అనుమతించే కారణాల జాబితాను కూడా విస్తరించారు. గృహ సంబంధిత అవసరాలైన ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణానికి స్థలం కొనుగోలు, గృహ నిర్మాణం, గృహ రుణం తిరిగి చెల్లించడం, ఇంటి మరమ్మతులు లేదా ఆధునీకరణ వంటి వాటికి నిధులు డ్రా చేసుకోవచ్చు. వీటితో పాటు అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి ఖర్చుల కోసం 'అర్హత ఉన్న బ్యాలెన్స్‌'లో 100 శాతం వరకు