
రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి 2026 ఖరీఫ్ సీజన్ కు గానూ తొలివిడత నిధులను విడుదల చేశారు.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా లబ్ధి చేకూరింది. ఇందులో 45,69,817 మంది భూ యజమాని రైతులు ఉండగా, మరో 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సాగు చేస్తోన్న గిరిజన రైతు కుటుంబాలు ఉన్నారు.తొలి విడతగా ఒక్కొక్కరికీ రూ.7 వేల సాయంఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో అందజేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తం నిధులలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గత ఏడాది కూడా ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.8,985.41 కోట్లను రైతులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే...!!స్టాళ్ల పరిశీలన.. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు శంకుస్థాపనలింగంగుంట్ల