పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్
Actor ProfilePolitician

పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్

Total News1
Movie Updates0
Sources1
పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్
Vaartha16 Jun 2026
పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్

AP PECET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET-2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రకటించారు. ఈసారి మొత్తం 89.76 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. Read also: Rayapati Shailaja: అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం ఈ ఏడాది పీఈసెట్ కోసం మొత్తం 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 2,655 మంది అర్హత సాధించి విజయవంతమయ్యారు. ఫలితాల్లో పురుష అభ్యర్థులు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన పురుషుల్లో 92.91 శాతం మంది (1,993 మంది) అర్హత సాధించగా, మహిళల్లో 81.43 శాతం (662 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు క్రీడల రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ ( ద్వారా చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్ కార్డులను కూడా అదే పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనంగా, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Rayapati Shailaja: అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం Jagan – CBN : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్ Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు Pawan Delhi Tour : కేంద్ర మంత్రులతో పవన్ బిజీ ..బిజీ Pawan