నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే
Actor ProfilePolitician

నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే
Zee Telugu17 Jun 2026
నల్గగొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం.. నిందితులు వీళ్లే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Nalgonda NTR Statue Burning Case: నల్లగొండ పట్టణంలో జూన్ 6వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనను నల్లగొండ టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఎన్.జి. కళాశాల సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మున్సిపల్ 48వ వార్డు అధికారి బుజనూరి స్వప్న ఫిర్యాదు మేరకు నల్లగొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ సీసీఎస్, టూ టౌన్ పోలీసుల సంయుక్త బృందాలు సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లోని వందలాది గంటల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాయి. అనుమానాస్పద వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలు, ప్రయాణ వివరాలను విశ్లేషిస్తూ నిందితుల జాడను కనుగొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కుట్రలో భాగంగా మొదట నల్లగొండలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపిక చేసుకుని, సంఘటనకు ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి, దాడికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం