
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది. ముక్కోణపు వన్డే సిరీస్ కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ భారత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇక మూడో మ్యాచ్‌లో శ్రీలంక అఫ్గనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 265 పరుగులు చేసి ఆలౌట్ గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు. అయితే, ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పది పరుగుల పెనాల్టీ శ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత