
బిగ్ బాస్ సీజన్ 10 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే 9 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 10లోకి అడుగుపెడుతుంది. బిగ్ బాస్ 10ను ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. ఈసారి కూడా బిగ్ బాస్ 10 కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వివిధ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్.. తెలుగులోనూ మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 10 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 10కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. గత సీజన్ లో సామాన్యులకు పెద్ద పీట వేస్తూ.. అగ్నిపరిక్ష పేరుతో కొంతమందిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఈసారి కూడా అదే తరహాలో సామాన్యులకు సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపనున్నారు. త్వరలోనే అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ 10 అనౌన్సమెంట్ వచ్చిందో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. మమల్ని బిగ్ బాస్ లోకి పంపించండి అంటూ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్ 10 లో అవకాశం ఇవ్వాలి అని స్వయంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో సోషల్