నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్
Actor ProfilePolitician

నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Andhra Jyothy8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. న్యూఢిల్లీ: రాష్ట్రపతి

నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్
Andhra Jyothy8 Jul 2026
నటుడి పార్టీ అంటూ విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం విజయ్

టీవీకే ఒక నటుడి పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం విజయ్ తిప్పికొట్టారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: టీవీకే ఒక నటుడి పార్టీ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తమిళనాడు సీఎం విజయ్ తిప్పికొట్టారు. గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని అన్నారు. ప్రజల తరఫున పోరాడానని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. కరూర్ తొక్కిసలాట కాంట్రవర్సీ రూపంలో పెను సవాలు ఎదురైందని అన్నారు. ఫ్యాన్ క్లబ్‌లుగా ఉన్న సమయంలో కూడా తాము ప్రజల పక్షాన నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాల ద్వారా టీవీకే పార్టీ పునాది ఏర్పడిందని అన్నారు. సినిమాల్లో కూడా తాను సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేకతను చూపించానని చెప్పారు. 2008లో శ్రీలంక తమిళుల కోసం, 2011లో మత్స్యకారుల తరఫున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్నీ పేర్కొన్నారు. జల్లికట్టు నిరసనలకు కూడా మద్దతు తెలిపిన విషయాన్ని పేర్కొన్నారు. సంఘ సంస్కర్తలు చూపించిన మార్గంలో తాము ముందుకు వెళుతున్నామని కూడా సీఎం విజయ్ తెలిపారు. మతవిశ్వాసాలు వలదన్న పెరియార్ వాదనకు తాము వ్యతిరేకమైనప్పటికీ స్థూలంగా ఆయన చూపించిన బాటలోనే నడుస్తున్నామని అన్నారు. అంబేడ్కర్, కామరాజార్లను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు. చాలా మంది మొదట పార్టీ పెట్టి ఆపై ప్రజల వద్దకు వెళతారని, తాను ముందు ప్రజల్లో ఉండి ఆ తరువాత పార్టీ పెట్టానని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారే తమది నటుడి పార్టీ అని విమర్శిస్తున్నారని అన్నారు. సాధారణ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కుల, మత అడ్డుగోడలను తమ పార్టీ ఇటీవల ఎన్నికల్లో కూల్చేసిందని చెప్పారు. తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత స్టాలిన్‌‌ను గుర్తుకు తెస్తూ సైగలు.. సీఎం