నగలు కొనాలనుకునే వారికి భారీ ఉపశమనం
Actor ProfilePolitician

నగలు కొనాలనుకునే వారికి భారీ ఉపశమనం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నగలు కొనాలనుకునే వారికి భారీ ఉపశమనం
Oneindia Telugu12 Jul 2026
నగలు కొనాలనుకునే వారికి భారీ ఉపశమనం

బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు కూడా ఉపశమనం లభించింది. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావం స్థానిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా లేదా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఇప్పుడు వరుసగా రెండు రోజులు క్షీణించడం పట్ల సాధారణ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశం.గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువ హెచ్చుతగ్గుల ప్రభావం స్థానిక బులియన్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత రిటైల్ మార్కెట్ వివరాల ప్రకారం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,590 వద్ద ట్రేడవుతుండగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం రూ.1,32,540 వద్ద కొనసాగుతోంది.తాజా మార్కెట్ వివరాలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 270 మేర తగ్గి 1,44,330 వద్ద ముగిసింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధరలో 250 రూపాయల తగ్గుదల కనిపించింది. 10 గ్రాములకు 1,32,300లకు చేరింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం, గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,995 వద్ద ముగిసింది.దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా బంగారం ధర ఒడిదుడుకులకు లోనైంది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర భారీగా 1.28 శాతం అంటే దాదాపు రూ. 1,875 క్షీణించి, 10 గ్రాములకు రూ. 1,44,654 కి పడిపోయింది. అంతర్జాతీయంగా అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా దాదాపు 1.55 శాతం క్షీణించింది.చెన్నై..24 క్యారెట్లు- రూ. 14,564, 22 క్యారెట్లు