
అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నక్కపల్లిలో ప్రత్యేక బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని స్థానిక మత్స్యకారులు, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా, జూన్ 24: జిల్లాలోని నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నక్కపల్లిలో ప్రత్యేక బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని స్థానిక మత్స్యకారులు, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం పాఠశాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించి పాఠశాల మంజూరు చేసినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నక్కపల్లికి బీసీ గురుకుల పాఠశాల మంజూరు విషయంలో హోం మంత్రి అనిత ప్రత్యేకంగా కృషి చేశారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అనిత అన్నారు. గురుకుల పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మత్స్యకార కుటుంబాల విద్యార్థుల విద్యాభివృద్ధికి గురుకుల పాఠశాల ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ‘నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం’ అని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. బీసీ గురుకుల పాఠశాల మంజూరు కావడంతో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు.. హోం మంత్రి వంగలపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్ ‘బాగున్నారా’ అంటూ కరచాలనం.. మోపిదేవిలో ప్రజలను ఆప్యాయంగా పలకించిన లోకేశ్