
నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు కథానాయికగా, ఆ తర్వాత సహయ నటిగా వెండితెరపై అలరించింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత క్లిష్టమైన మొదటి వివాహం , దాని పర్యవసానాల గురించి పంచుకున్నారు. ఆమె తన సినీ ప్రస్థానాన్ని మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో కొనసాగిస్తూ, ఒక రోజుకు మూడు షూటింగ్‌లు చేసే స్థాయికి చేరుకున్నారు. తన కుటుంబం ఆర్థికంగా స్థిరపడిందని భావిస్తున్న సమయంలో, ఆమె జీవితంలోకి ఒక మలయాళ దర్శకుడు ప్రవేశించాడు. దాదాపు 25 చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిచింది. ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది.. ఆ దర్శకుడు తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించి, రక్తం తో ఉత్తరాలు రాసి తనను పెళ్లికి ఒప్పించాడని తెలిపింది. అతని తీవ్రమైన ఒత్తిడికి తలొగ్గి, కొచ్చిన్‌లోని చోటానికరా దేవాలయంలో అతనిని వివాహం చేసుకున్నానని.. ఈ వివాహానికి తన కుటుంబ సభ్యులు ఇష్టం లేకుండానే హాజరై, పెళ్లి తర్వాత "నీకు తర్వాత తెలుస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయారని అన్నారు.. అయితే, వారు ఒక మంచి పని చేశారు. పెళ్లి సమయంలో ఆమె నుండి ఒక పవర్ ఆఫ్ అటార్నీని రాయించుకున్నారు. దాని ప్రకారం ఆమెకు పిల్లలు పుట్టాకే ఆస్తి హక్కులు లభిస్తాయి. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి జరిగిన వారం రోజులకే ఈ పవర్ ఆఫ్ అటార్నీ విషయం భర్తకు తెలిసి, దానిని రద్దు చేయమని డిమాండ్ చేశాడు. తనను డబ్బు కోసమే వివాహం చేసుకున్నాడని, అతని నిజ స్వరూపం బయటపడటంతో షాక్‌కు గురయ్యానని అన్నారు