
Andhra Jyothy•10 Jul 2026
న విచారణకు హాజరవ్వండిరాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా.. అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా కమిషన్ గతంలో జారీ చేసిన సమన్లపై అమర్నాథ్ స్పందిస్తూ... ‘వివరణకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు నాకు సమయం కావాలి. ఈ నెల 25 తర్వాత హాజరవుతాను’ అని కమిషన్‌కు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న మహిళా కమిషన్ తాజాగా సమన్లు జారీ చేసింది