నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
Actor ProfilePolitician

నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
Asianet News Telugu28 Aug 2026
నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి కెరీర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌పై ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో సెటిల్ అవ్వాలని చూస్తున్న బీటెక్ గ్రాడ్యుయేట్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. వేర్వేరు డిపార్ట్‌మెంట్స్ వారీగా చూసుకుంటే.. అత్యధికంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 125 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) విభాగంలో 6 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలికాం) విభాగంలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. మీ క్వాలిఫికేషన్‌ను బట్టి ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్టులలో బీఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి. అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే.. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌లో అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తున్న మెయిన్ హైలైట్ శాలరీనే. ఇందులో ఉద్యోగం సాధిస్తే లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం