నాలుగు రాష్ట్రాల్లో.. ఓటు హక్కు! ప్రకాశ్ రాజ్
Actor ProfileActor

నాలుగు రాష్ట్రాల్లో.. ఓటు హక్కు! ప్రకాశ్ రాజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాలుగు రాష్ట్రాల్లో.. ఓటు హక్కు! ప్రకాశ్ రాజ్ పై.. నాన్ బెయిలబుల్ వారెంట్
Chitrajyothy30 Jun 2026
నాలుగు రాష్ట్రాల్లో.. ఓటు హక్కు! ప్రకాశ్ రాజ్ పై.. నాన్ బెయిలబుల్ వారెంట్

నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయనే ఆరోపణల కేసులో బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సినీన టుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj)పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non Bailable Warrant) జారీ అయింది. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులను (Voter ID Case) కలిగి ఉన్నారంటూ దాఖలైన కేసులో బెంగళూరు 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ఈ వారెంట్ జారీ చేసింది. ప్రకాశరాజ్‌కు పలుచోట్ల ఓటు హక్కు ఉందంటూ దిలీప్ కుమార్ (Dilip Kumar) అనే న్యాయవాది 2019లో బెంగళూరు నగరం హలసూరు గేట్ (Bengaluru Court) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏపీలోనూ ప్రకాశ్ రాజ్‌కు ఓటు హక్కు ఉందన్నారు. ఈ కేసులో ప్రకాశ్ రాజ్ విచారణకు వరు సగా హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది