నారా లోకేష్ తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
Actor ProfilePolitician

నారా లోకేష్ తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నారా లోకేష్ తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
Chitrajyothy7 Jul 2026
నారా లోకేష్ తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే

ఏపీ మినిస్టర్ నారా లోకేష్‌తో తనని పోల్చుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తనకంటూ స్టార్‌డమ్‌ని క్రియేట్ చేసుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan). ఇప్పుడాయన ఉన్న ఈ స్టేజ్ కోసం ఎంత కష్టపడ్డారో.. సినీ ఇండస్ట్రీలోని చాలా మందికి తెలుసు. చిరంజీవి కొడుకుగా ఆ లెగసీని మోయడం ఎంత కష్టమో తెలియంది కాదు. కానీ, చరణ్.. తన కష్టంతో ఆ లెగసీని ముందుకు తీసుకెళుతున్నారు. తండ్రి లెగసీనే కాకుండా, బాబాయ్ బాధ్యతని కూడా ఆయన సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేదికపై రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా తనని.. ఏపీ మినిస్టర్ నారా లోకేష్‌ (Nara Lokesh)తో పోల్చుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చరణ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ‘‘తండ్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. లోకేష్ నాయుడు దానిని అడ్వాంటేజ్ తీసుకోలేదు. తన స్వయంకృషితో.. ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రజా నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తూ, విజయవంతంగా సాగుతున్నారు. అలాగే మీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అంత పెద్ద‌ స్టార్ అయినప్పటికీ.. మీరు కూడా అలాగే కష్టపడుతూ.. స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. నారా లోకేష్‌కు, మీకు.. మధ్య ఈ విషయంలో పోలిక ఉందని భావిస్తున్నారా?’’ అని ఈ సమ్మిట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రామ్ చరణ్ ఏ మాత్రం ఆలోచించకుండా, వెంటనే.. ‘అవును.. కచ్చితంగా ఉంది’ అని అంగీకరించారు. చరణ్ ఆలోచించకపోవడానికి పెద్ద