నోరూరించే.. వెరైటీ వంటకాలు
Actor ProfilePolitician

నోరూరించే.. వెరైటీ వంటకాలు

Total News1
Movie Updates0
Sources1
నోరూరించే.. వెరైటీ వంటకాలు
Sakshi14 Jun 2026
నోరూరించే.. వెరైటీ వంటకాలు

ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి. బాంబే ఐస్‌ హల్వా.. కావలసినవి: పాలు: ఒకటిన్నర కప్పు, పంచదార: కప్పు, కార్న్‌ ఫ్లోర్‌: 1/4 కప్పు, నెయ్యి: 1/4 కప్పు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: టీ స్పూన్, ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్‌ స్పూన్, పిస్తా ముక్కలు: టేబుల్‌ స్పూన్‌. ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్‌ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి. స్టవ్‌ ఆన్‌ చేసి మంటను సిమ్‌లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్‌గా కలుపుతుండాలి. ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్‌లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌తో పాటుగా నెయ్యి వేయండి. మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్‌ ఏలకుల పొడి వేసి బాగా కలపండి. మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి. ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు ఒక బటర్‌ పేపర్‌ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్‌ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్‌ పేపర్‌ షీట్‌ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి. ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్‌ పేపర్‌ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్‌ పేపర్‌తో సహా ముక్కలుగా కట్‌ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్‌ హల్వా సిద్ధం! ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్‌ ముక్కలను తీసుకోండి. అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి