
మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్) స్వతహాగా కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే.. 2007 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'కెవ్వు కేక' మూవీలో నటించింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు సినిమాలు చేసింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్ మెంటైన్ చేసింది. కొన్నిరోజుల క్రితమే షర్మిల-సుధాన్ డేటింగ్ సంగతి బయటపడింది. ఇప్పుడు సదరు రూమర్స్ నిజం చేస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న షర్మిల.. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చు. సుధాన్ సుందరం విషయానికొస్తే విజయ్ సేతుపతి 'మహారాజా' నిర్మించింది ఈయనే. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్) టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్