నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్ గా ఇడుపుకాయితం స్టార్ట్
Actor ProfileActor

నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్ గా ఇడుపుకాయితం స్టార్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్ గా ఇడుపుకాయితం స్టార్ట్
Asianet News Telugu21 Jul 2026
నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్ గా ఇడుపుకాయితం స్టార్ట్

ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ.. ఫోక్‌ సాంగ్స్ తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. జానపద పాటల్లో ఆమె చేసే డాన్సులు చూస్తే ఊగిపోవాల్సిందే. ఎలాంటివారైనా డాన్సులు చేసేలా ఆమె స్టెప్పులుంటాయి. యూట్యూబ్‌లో ఫోక్‌ స్టార్‌గా రాణిస్తోన్న నాగదుర్గ ఇప్పుడు బిగ్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె హీరోయిన్‌గా సినిమా ప్రారంభమైంది. `ఇడుపు కాయితం` పేరుతో గురువారం ప్రారంభమైన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. బన్నీవాసు, తబితా సుకుమార్‌ నిర్మిస్తున్నారు. బన్నీ వాస్‌ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ మూవీ రూపొందుతుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. ఇందులో నాగదుర్గ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నిర్మాత బన్నీవాసు. హీరోయిన్‌గా ఆమెని తీసుకోవాలంటే 15 కండీషన్స్ పెట్టిందట. ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఎంత సెలక్టీవ్‌గా ఉంటుందో అర్థమైందని, ఇలా ప్రతి విషయంలో కాన్ఫిడెంట్‌గా, తనకు ఏం కావాలో అంత క్లారిటీగా ఉందని చెప్పాడు బన్నీవాసు. ఆయన మాట్లాడుతూ, నేను సుకుమార్ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా. కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి` అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఇడుపు కాయితం"తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం. సబ్ టైటిల్స్ తో బిహార్ లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్ కు వెళ్లండి, అబ్బాయి