
Pawan kalyan | జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నహనుమకొండకు చెందిన అభిమాని నిరంజన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ నేడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన పవన్ కల్యాణ్ తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా పవన్ కల్యాణ్ ఆ ఇంటి ఓనర్స్‌ను పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా.. వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్‌కే సాగర్ తదితరులు ఉన్నారు. Chikiri Chikiri | ‘పెద్ది’ నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. చికిరి చికిరితో అదరగొట్టిన రామ్ చరణ్, జాన్వీ Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్ KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్