
ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ


ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ భక్తుడిగా.. ఆయన స్ఫూర్తితో నిరంజన్‌కు ఆర్థిక సాయం చేశాను. దైవసమానులైన పవన్ కల్యాణ్ పరామర్శతో నిరంజన్ విషయం నా దృష్టికి వచ్చింది. మేమందరం ఇలా ఉన్నామంటే పవన్ కల్యాణ్ దయతోనే. నా కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా. ఈ రోజు వచ్చి ఆర్థిక సాయం చేయాలనుకున్నాను. నారా భువనేశ్వరి పుట్టిన రోజున ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది. నిరంజన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను’ అని అన్నారు. 'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం