నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి
Actor ProfileActor

నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి
TV9 Telugu22 Aug 2026
నోరు జారీ అప్పుడు అలా మాట్లాడాను.. చిరంజీవి గారు నన్ను క్షమించండి

ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ తన సినీ ప్రస్థానం, విజయాలు, వివాదాలు, అలాగే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజాలతో తన అనుబంధం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నరసింహ నాయుడు (బాలకృష్ణ), ఇంద్ర (చిరంజీవి) వంటి చిత్రాలతో అఖండ విజయాలు సాధించి, అల్లు అర్జున్‌ను గంగోత్రితో పరిచయం చేసిన ఘనత చిన్నికృష్ణది. తాజాగా దాసరి నారాయణరావు గారితో తన తొలి పరిచయం, ఆయన కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా పరిచయం అయిన సినిమా కోసం గోస్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో తను కాదలిక్కుం మర్యాదై అనే తమిళ సినిమాను చూసి, దాసరి గారిని కూడా చూడమని కోరారు. ఆ సినిమా చూసిన దాసరి గారు భావోద్వేగానికి లోనయ్యారని, ఆ సినిమాను కొనుగోలు చేసి తన కుమారుడితో తీయమని తాను సలహా ఇచ్చినట్లు చిన్నికృష్ణ తెలిపారు. అయితే, ఆ తర్వాత దాసరి గారి కుమారుడి చిత్రం గ్రీకు వీరుడు పేరుతో వేరే టైటిల్, కథతో ముందుకు సాగడం తనను నిరాశపరిచిందని, టైటిల్ వల్ల సినిమాలు ఆడవని తాను గట్టిగా నమ్ముతానని పేర్కొన్నారు. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ మెగాస్టార్ చిరంజీవి గారి 150వ చిత్రానికి శివయ్య నాయుడు అనే కథను తాను సిద్ధం చేసినప్పటికీ, మురుగదాస్ గారి కత్తి చిత్రం తెలుగు రీమేక్ ఖైదీ నంబర్ 150గా రావడాన్ని తాను సంతోషంగా అంగీకరించినట్లు చిన్నికృష్ణ వివరించారు. ఒక భాషలో విజయం సాధించిన కథను నిర్మించడం సులభమని, తన సొంత కథకు దర్శకుడు పూర్తి స్థాయి కృషి చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కంటెంట్ జనంలోకి వెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, తాను రీచ్ అవ్వాలని ఎప్పుడూ