నియోజకవర్గాల పునర్విభజన
Actor ProfilePolitician

నియోజకవర్గాల పునర్విభజన

Total News1
Movie Updates0
Sources1
నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్
AP7AM18 Jun 2026
నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పునర్విభజన విధానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచినప్పటికీ, అది అంతిమంగా ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకే రాజకీయంగా భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుందని శశి థరూర్ వాదించారు. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో తగినంత మెజారిటీ లేక ఆగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని చంద్రబాబు విమర్శించిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ‘‘మీ జీతం రెండు లక్షల రూపాయలు, మీ డ్రైవర్ జీతం ఇరవై వేల రూపాయలు అనుకుందాం.. ఇప్పుడు అందరికీ 50 శాతం జీతం పెంచుతున్నట్లు ప్రకటిస్తే, మీ జీతం మూడు లక్షలు, డ్రైవర్ జీతం ముప్పై వేలు అవుతుంది’’ అని పేర్కొన్నారు. ఇద్దరికీ పెరిగిన శాతం ఒక్కటే అయినప్పటికీ, ఆర్థికంగా మీరే ఎక్కువ ప్రయోజనం పొందుతారు కదా? అంటూ ప్రశ్నించారు. ఇదే సూత్రాన్ని స్థానాల పునర్విభజనకు అన్వయిస్తూ.. ఒకవేళ స్థానాలు పెంచితే ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 80 నుంచి 120 కి పెరుగుతుందని, అదే కేరళలో 20 నుంచి 30కి మాత్రమే పెరుగుతుందని వివరించారు. దీనివల్ల యూపీకి అదనంగా 40 మంది ఎంపీలు వస్తే, కేరళకు