న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్
Actor ProfilePolitician

న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్

Total News1
Movie Updates0
Sources1
న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్
Sakshi14 Jun 2026
న్యూజిలాండ్ కు షాకిచ్చిన వెస్టిండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్‌(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్‌(35) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్‌ షెమైన్ కాంప్‌బెల్‌ది కీలక పాత్ర. కాంప్‌బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించింది. ఆమె టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ