
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 పునఃపరీక్ష నేడు జరగనుంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది వైద్య విద్యా ఆశావాహులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షల సమర్థ నిర్వహణ కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాలపై కూడా ఎన్‌టీఏ నిఘా ఉంచింది.తెలుగు రాష్ట్రాల్లో 1.38 లక్షల మంది అభ్యర్థులుఈ పునఃపరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 65,790 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 24 నగరాల్లో 208 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి 72,956 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.NEET ఇంత దుర్మార్గమా? నాగ్‌పూర్ కుర్రాడికి అబుదాబిలో సెంటరా!పరీక్ష సమయాలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు (మొత్తం 195 నిమిషాలు) పరీక్ష జరగనుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. సాధారణ అభ్యర్థులకు 5.15 గంటల వరకు సమయం ఉండగా, దివ్యాంగ (PwD/PwBD) అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అదనపు సమయం కల్పించారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం రఫ్ వర్క్ కోసం ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో గతంలో కంటే అదనంగా (మొత్తం నాలుగు పేజీలు) కేటాయించారు.వెంట తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన