నా మాటలను బీప్ చేయొద్దు
Actor ProfilePolitician

నా మాటలను బీప్ చేయొద్దు

Total News1
Movie Updates0
Sources1
నా మాటలను బీప్ చేయొద్దు
Eenadu17 Jun 2026
నా మాటలను బీప్ చేయొద్దు

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. పలువురు ఎంపీలు ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మాటలను బీప్ చేయొద్దని పాత్రికేయులకు సూచించడం గమనార్హం. ‘‘ద్రోహులు వెళ్లిపోవాలి. అసమ్మతివాదులు మొదట రాజీనామా చేయాలి. పార్టీ టికెట్‌పై గెలిచినవారికి ప్రజాతీర్పును మోసగించే హక్కు లేదు. పార్టీ మారేందుకు కొందరు ఎంపీలకు రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మాకు చీలిక గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మీడియాలో చక్కర్లు కొడుతోన్న వార్తలతో ఈ విషయం మా దృష్టికి వచ్చింది’’ అని రౌత్ మాట్లాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు