
అగ్ర కథానాయిక సమంత ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించిన, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత (Samantha) ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె


అగ్ర కథానాయిక సమంత ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించిన, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత (Samantha) ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె

ఇంటర్నెట్ డెస్క్: నటి సమంత ప్రస్తుతం హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) విజయం సాధించింది. మరోవైపు ఆమె తల్లి కానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు పుట్టే పిల్లల గురించి సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సమంత (Samantha) మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం’’ అని అన్నారు. అదే ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి కూడా పంచుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా’’ అని చెప్పారు. తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబి బంప్‌తో కనిపించారు. ఈ విషయంపై ఆమె సన్నిహిత వర్గాలను అడగ్గా.. సమంత, రాజ్‌లకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం అని.. వాళ్లిద్దరూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారని వెల్లడించాయి. దీంతో త్వరలోనే సామ్ ఈ గుడ్ న్యూస్‌ను అధికారికంగా వెల్లడిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో రూ.28 కోట్లు వసూళ్లు చేసింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది (Maa Inti Bangaaram Collections). సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన రీల్స్ వైరల్‌గా మారాయి. ‘మా ఇంటి బంగారం’ విజయం సాధించడంతో అభిమానులు, సెలబ్రిటీలు సమంతకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా నటి నయనతార (Nayanthara) ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘సామ్