నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం
Actor ProfilePolitician

నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం
Andhra Jyothy11 Jul 2026
నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం

ఇరాన్‌‌తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది.. తన పనిని మరింత కష్టం చేసిందని, ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లైందని విమర్శించారు. వాషింగ్టన్ డీసీ, జూన్ 24: ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెనేటర్లు తీసుకున్న ఈ నిర్ణయం తన పనిని మరింత కష్టతరం చేసిందని, అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లు అయిందని ఆయన మండిపడ్డారు. సెనేట్ ఓటింగ్‌లో తన సొంత పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు డెమోక్రాట్లతో చేతులు కలపడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఇరాన్ లొంగిపోయే స్థితిలో ఉంటే.. వీళ్లు అడ్డుపడ్డారు' తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ వరుస పోస్ట్‌లు పెడుతూ సెనేట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 'చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడింది. అమెరికా అడిగిన ప్రతిదానికీ ఒప్పుకునే స్థితికి వచ్చింది. దశాబ్దాల తర్వాత అమెరికాను, దేశ అధ్యక్షుడైన నన్ను చూసి ఇరాన్ గజగజలాడుతోంది. ఇలాంటి కీలక సమయంలో యూఎస్ సెనేట్ ఏమాత్రం సమయం కాని సమయంలో, అర్థం లేని 'వార్ పవర్స్ యాక్ట్' ఓటింగ్ పెట్టింది' అని ట్రంప్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో తమకు నచ్చడం లేదని, ఆయనను ఆపాలని శత్రుదేశానికి పార్లమెంటే చెబుతున్నట్లుగా ఈ తీర్మానం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఓటింగ్ ఫలితం చూసి 'దీని అర్థం ఏంటి?' అని ఇరాన్ ప్రతినిధులు తన అధికారులను అడుగుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలపై 'రిపబ్లికన్ లూజర్స్' అంటూ ఫైర్ సెనేట్‌లో ఈ