నిప్పుల కొలిమిలా మారిన ఐరోపా
Actor ProfilePolitician

నిప్పుల కొలిమిలా మారిన ఐరోపా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిప్పుల కొలిమిలా మారిన ఐరోపా, సెగలు గక్కుతున్న ఖండం
Oneindia Telugu14 Jul 2026
నిప్పుల కొలిమిలా మారిన ఐరోపా, సెగలు గక్కుతున్న ఖండం

సెగలు గక్కుతున్న అగ్నిపర్వతంలా ప్రస్తుతం ఐరోపా ఖండం (యూరప్) మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండలు ఏకంగా 45 డిగ్రీల సెల్సియస్ దాటడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తీవ్రమైన వేడి వాతావరణం వల్ల విద్యుత్ వ్యవస్థలపై ఊహించని ఒత్తిడి పడుతుండటంతో పాటు అనేక దేశాలలో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హ్యూ మోంట్‌గోమరి స్పందిస్తూ.. ఇది కేవలం వాతావరణంలో వచ్చిన తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, రాబోయే మహా ప్రళయానికి ఇవి ప్రారంభ సంకేతాలు అని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా జూలై మాసం రాకముందే యూరప్ లో ఈ రకమైన ఎండలు రావడం భవిష్యత్తు ప్రమాదాలను ముందే సూచిస్తోంది.ఆకాశంలో ఏర్పడిన భారీ ఒమేగా బ్లాక్.. ఏమిటిది?ఈ విపరీతమైన ఎండలకు ప్రధాన కారణం అంతరిక్ష వాతావరణంలో ఏర్పడిన ఒమేగా బ్లాక్’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రీకు అక్షరం ఒమేగా (Omega) ఆకారంలో ఉండే ఈ వాతావరణ పద్ధతి వల్ల భారీ అధిక పీడన వ్యవస్థ రెండు అల్పపీడన ప్రాంతాల మధ్య చిక్కుకుపోతుంది. దీనివల్ల సాధారణంగా పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణించే గాలులు నిలిచిపోయి, ఒకే చోట వేడి గాలి స్థిరపడిపోతుంది. ఈ దృగ్విషయాన్ని శాస్త్రవేత్తలు హీట్ డోమ్ అని పిలుస్తారు. దీని కారణంగా ఆకాశంలో మేఘాలు ఏర్పడవు, దాంతో సూర్యరశ్మి నేరుగా భూమిని వేడెక్కిస్తుంది. చల్లటి గాలి లోపలికి ప్రవేశించే మార్గం లేకపోవడంతో ఆ వేడి గాలి ఒక గిన్నెపై మూత పెట్టినట్లు అక్కడే బందీ అయిపోతుంది. సాధారణంగా వేసవిలో ఇలాంటి హీట్ డోమ్స్ ఏర్పడటం సహజమే అయినప్పటికీ, ప్రస్తుత ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం శాస్త్రవేత్తలను సైతం వణికిస్తోంది.ప్రాణాంతకంగా మారిన ఎండలు.. నదుల్లో శవాలు!ఈ భీకరమైన వేడికి తట్టుకోలేక చాలా మంది ఉపశమనం కోసం నీటి వనరుల వైపు పరుగులు తీస్తున్నారు. ఫ్రాన్స్ లో జూన్ 18 నుంచి