నేనేమి పతివ్రతను కాదు.. పార్టీలో తాగుతాను.. జబర్దస్త్ నటి
Actor ProfilePolitician

నేనేమి పతివ్రతను కాదు.. పార్టీలో తాగుతాను.. జబర్దస్త్ నటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేనేమి పతివ్రతను కాదు.. పార్టీలో తాగుతాను.. జబర్దస్త్ నటి
TV9 Telugu25 Jul 2026
నేనేమి పతివ్రతను కాదు.. పార్టీలో తాగుతాను.. జబర్దస్త్ నటి

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీరియల్స్ ద్వారా మొదలైన ప్రయాణం .. ఆ తర్వాత యాంకర్ గా మారింది. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలోని పలు సంఘటనలు, బాల్యం నుండి ఎదుర్కొన్న ఆర్థిక, సామాజిక పోరాటాల గురించి పంచుకున్నారు. అలాగే తన తల్లికి సంబంధించిన భావోద్వేగ క్షణాలు, ఆమె పట్ల ఉన్న ప్రగాఢ ప్రేమ, అలాగే కుటుంబ నేపథ్యం గురించి వెల్లడించారు. సౌమ్య రావు స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఒక చిన్న తాలూకు. ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ప్రశ్నించగా, సౌమ్య స్పష్టంగా "నా ఫాదర్ వాళ్ళు వదిలేయ్. వాళ్ళ గురించి ఏమొద్దు, నో కామెంట్స్" అంటూ మాట్లాడటానికి నిరాకరించారు. అయితే, తన తల్లితో తనకు చాలా బలమైన బంధం ఉందని ఆమె తెలిపారు. సింగిల్ పేరెంట్ కాదని, తన తల్లీదండ్రులు ఇద్దరూ ఉన్నారని సౌమ్య పేర్కొన్నారు. ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్.. తన జీవితంలో కేవలం కొద్దిమంది వ్యక్తులే తనతో సన్నిహితంగా ఉంటారని, వారి కోసమే తాను జీవిస్తున్నానని సౌమ్య అన్నారు. "ఒక లైఫ్‌లో అందరూ మంచిగా దొరకాలనేది ఒక తలరాత. అందరికీ ఒక మంచి ఫాదర్ దొరకాలి, ఒక మంచి మదర్ దొరకాలి, అందరూ హెల్దీగా ఉండాలి, ఒక మంచి బ్రదర్ దొరకాలి" అంటూ చెప్పుకొచ్చారు. సౌమ్య తన బాల్యాన్ని, తన తల్లి ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికాన్ని గుర్తుచేసుకున్నారు. "మా అమ్మకి అప్పుడు చాలా పావర్టీ రా" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా తన తల్లి సామాజికంగా ఎదుర్కొన్న అవమానాలను సౌమ్య వెల్లడించారు. ఏదైనా శుభకార్యానికి, పెళ్లిళ్లకు