నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ
Actor ProfileActor

నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్
TV9 Telugu19 Aug 2026
నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఉన్న టాప్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ, డీ వంటి టాప్ టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ. అదే సమయంలో అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా రష్మీ ఖాతాలో మరో రియాలిటీ షో చేరింది. ఆహా ఓటీటీలో టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించనుంది రష్మీ. త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. దీంతో రష్మీ కూడా ప్రమోషన్లలో పాల్గొంటోంది. తాజాగా ఆహా కర్టెన్ రైజర్ ఈవెంట్ కు హాజరైన ఈ జబర్దస్త్ యాంకర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలను కూడా వివరించింది. 'మా ఫ్యామిలీ అంతా సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌. మా అమ్మ మమతా గౌతమ్‌ ది ఒరిస్సా. మా నాన్న రామ్‌ గౌతమ్‌ ది ఉత్తర ప్రదేశ్‌. కానీ నేను మాత్రం విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అతా చాలా కూల్‌గా, అఫీషియల్‌గా, డిగ్నిటీగా ఉంటారు. నేను మాత్రమే ఈ సినిమా రంగంలోకి వచ్చాను. నా అమ్మనాన్నలు, తాతలు, అన్నలు, అమ్మమ్మలకు ఈ సినిమా ఇండస్ట్రీలో సంబంధం లేదు. నేను మాత్రమే దారి తప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. మా నాన్న చిన్నప్పుడే మరణించాడట. దీంతో అమ్మనే నన్ను పెంచి పోషించింది. ప్రారంభంలో 'యువ' అనే సీరియల్ లో నటించాను. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కొంత కాలం బ్రేక్ తీసుకున్నను. అనంతరం మళ్లీ ప్రయత్నాలు చేయగా, సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ కి యాంకర్‌గా చేసే ఛాన్స్ కూడా వచ్చింది'