
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ktr slams on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది. ఈ క్రమంలో ఎక్కడ చాన్స్ దొరికిన నేతలు విమర్శనాస్త్రాలు సంధించు కుంటున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ లోని వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను కేసీఆర్ అంతా మంచొడ్ని కాదని తెల్చి చెప్పారు. అక్రమంగా కేసులు పెడుతున్న అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రిటైర్ అయిన, సప్త సముద్రాల వెనుక దాక్కున్న వదిలేదని లేదని తెల్చి చెప్పారు. తమపై , పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోమని చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల్ని వేధించిన వారిని ఒక్కొక్కడినీ వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాదన్నారు. అంతే కాకుండా గతంలో కొన్ని తప్పులు జరిగాయని, మన కార్యకర్తలను పట్టించుకోని మాట వాస్తవమేనని ఒప్పుుకున్నారు. కానీ వచ్చే ఐదు ఏండ్లలో రాజకీయంగా, ఆర్థికంగా మీ బతుకులు మార్చే బాధ్యత నేనే తీసుకుంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా అని.. తనకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసన్నారు. Read more: Brs ktr: బడే భాయ్, ఛోటే భాయ్ కలిసి తెలంగాణను