నేనొక యాక్షన్ గర్ల్
Actor ProfileActor

నేనొక యాక్షన్ గర్ల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేనొక యాక్షన్ గర్ల్
Sakshi5 Aug 2026
నేనొక యాక్షన్ గర్ల్

కెమెరా వెనుక ఉండాలని కలలు కన్న అమ్మాయి.. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లామర్‌తో పాటు స్ట్రా్టంగ్‌ ఒపీనియన్స్‌ ఉన్న నటి మాళవికా మోహనన్‌ , చిల్‌ వైబ్స్‌తో మనతో పంచుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఆమె మాటల్లోనే! యాక్టింగ్‌ ప్లాన్‌ లోనే లేదు! చిన్నప్పటి నుంచి కెమెరా వెనకే ఉండాలని అనుకునేదాన్ని. నాన్న కె.యూ.మోహనన్‌ సినిమాటోగ్రాఫర్‌. ఆయన తీసే షాట్స్‌ చూస్తూ పెరిగా. అందుకే మాస్‌ మీడియా చదివి డైరెక్షన్‌ లోకి వెళ్లాలనుకున్నా. కానీ ఒక రోజు మమ్ముట్టి సర్‌ నన్ను చూసి ‘యాక్టింగ్‌ చేస్తావా?’ అని అడిగారు. అలా ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్‌ గా మారిపోయా! ఫైటింగ్‌లో ఉండే ఎనర్జీ వేరు! చిన్నప్పుడే ట్రెడిషనల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. ఒక సినిమా కోసం ‘సిలంబం’లో కూడా ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ తర్వాత అది నాకు చాలా ఇష్టమైపోయింది. ఆ స్టిక్‌ ఫైటింగ్‌లో ఉండే ఎనర్జీ, మూవ్‌మెంట్స్‌ చాలా మెడిటేటివ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు నా జిమ్‌ వర్కౌట్స్‌లో కూడా అది ఓ భాగమే. రజనీకాంత్‌ కాల్‌ అంటే షాక్‌! ఒకసారి రజనీకాంత్‌ సర్‌ నా పని చూసి స్వయంగా ఫోన్‌ చేశారు. ఆ క్షణం నిజంగా నమ్మలేకపోయా. ఇక హీరోయిన్స్‌లో నాకు నయనతార అంటే చాలా ఇష్టం. భారీ కార్లు, బైక్స్‌ అంటే పిచ్చి! నాకు కార్లు, బైక్స్‌ అంటే చాలా ఇష్టం. సినిమా సెట్స్‌లో కెమెరాలు, టెక్నికల్‌ ఎక్విప్‌మెంట్‌ చూస్తూ పెరగడం వల్ల మెకానికల్‌ విషయాల మీద కూడా ఇంట్రెస్ట్‌ పెరిగింది. నేను కొంచెం ‘మోటర్‌ హెడ్‌’ టైప్‌! అలాంటి అబ్బాయిలంటే ఇష్టం! ఒకసారి సోషల్‌ మీడియాలో ఓ ఫ్యాన్‌ ‘బ్లాక్, వీటిష్, వైట్‌.. ఎలాంటి అబ్బాయిలు ఇష్టం?’ అని అడిగాడు. దానికి నేను ఒక్క లైన్‌ లో ‘నాన్‌ సెక్సిస్ట్‌ వన్స్‌!’ అని చెప్పా. అంటే నా ఉద్దేశంలో గౌరవం, సమానత్వం రంగు కంటే చాలా