నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్
Actor ProfilePolitician

నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్ పై రజినీకాంత్ ఫైర్
Asianet News Telugu18 Jul 2026
నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్ పై రజినీకాంత్ ఫైర్

రజినీకాంత్ తన కొత్త సినిమా 'ధర్మన్' టైటిల్‌ను బుధవారం ప్రకటించారు. కమల్ హాసన్, అశ్వత్ మరిముత్తు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. తాను ఏం మాట్లాడినా, మౌనంగా ఉన్నా విమర్శలు వస్తున్నాయని, అందుకే పబ్లిక్‌గా మాట్లాడాలంటే కాస్త సంకోచిస్తున్నానని అన్నారు. మే నెలలో విజయ్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. "నన్ను మాట్లాడమని ఎవరైనా పిలిస్తేనే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే అది మీకో, నాకో సమస్య అవుతుంది. ఒకవేళ మౌనంగా ఉంటే.. నోట్లో స్వీట్ పెట్టుకున్నావా? ఎందుకు మాట్లాడట్లేదు? అని ఎగతాళి చేస్తారు" అని రజినీకాంత్ తమిళంలో అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచినప్పటి నుంచి, ఆ ఫలితాలతో రజినీకాంత్ సంతోషంగా లేరని పుకార్లు వచ్చాయి. ఈ వదంతులకు చెక్ పెట్టేందుకు, రజినీకాంత్ చెన్నైలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎన్నికల తర్వాత మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశానని, తామిద్దరం స్నేహితులమని స్పష్టం చేశారు. "అనవసరంగా మాట్లాడటానికి రజినీ అంత చీప్ వ్యక్తి కాదు. విజయ్ సీఎం అయ్యాడని విని షాక్ అయ్యాను. గెలవగానే ఆయన్ని అభినందించాను. నేను రాజకీయాల్లోనే లేను, విజయ్‌పై నాకెందుకు అసూయ? బహుశా కమల్ సీఎం అయితే నాకు అసూయ కలగొచ్చు. నాకూ, విజయ్‌కీ 25 ఏళ్ల జనరేషన్ గ్యాప్ ఉంది. మేం పోటీ పడితే బాగోదు" అని రజినీ అన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షల గురించి అడగ్గా, తాము మాట్లాడుకున్నామని, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదని చెప్పారు