నేను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటకొస్తాయి.. చాలామందికి ఇబ్బందులు
Actor ProfilePolitician

నేను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటకొస్తాయి.. చాలామందికి ఇబ్బందులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటకొస్తాయి.. చాలామందికి ఇబ్బందులు
AP7AM14 Aug 2026
నేను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటకొస్తాయి.. చాలామందికి ఇబ్బందులు

తాను ఆత్మకథ రాస్తే ఎన్నో నిజాలు బయటపెట్టాల్సి ఉంటుందని, ఆ నిజాలు చాలామందికి నచ్చకపోవచ్చని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ఆత్మకథ రాయడం లేదని స్పష్టం చేశారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రచించిన 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. "చాలామంది నన్ను ఆత్మకథ రాయమని అడిగారు. కానీ నేను రాస్తే ఎన్నో విషయాలు, నిజాలు చెప్పాల్సి ఉంటుంది. అవి కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే నేను రాయలేదు. అయితే, నా జీవితానుభవాలు ఇతరులకు, ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మాశర్మ అడిగినప్పుడు ఈ పుస్తకానికి అంగీకరించాను" అని వివరించారు.విభజన, రాజకీయాలపై కీలక వ్యాఖ్యలురాష్ట్ర విభజన పరిణామాలపైనా వెంకయ్యనాయుడు స్పందించారు. 2014కు ముందే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆనాటి రాజకీయ కారణాల వల్ల అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, విభజన తర్వాత తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు, ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా కృషి చేశానని గుర్తుచేశారు. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ.. రాజకీయ నేతలు తమ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని సూచించారు.స్ఫూర్తిదాయకం 'వెంకయ్య నాయకుడు'‘వెంకయ్య నాయకుడు’ పుస్తకంలో వెంకయ్యనాయుడి రాజకీయ ప్రస్థానాన్ని సమగ్రంగా పొందుపరిచారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి