
రోటర్‌డామ్: ప్రొ లీగ్ హాకీ టోర్నిలో భారత పురుషుల జట్టు మరో సంచలనం నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో ప్రపంచ రెండో ర్యాంక్ నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. మూడేళ్ల తర్వాత నెదర్లాండ్స్‌పై భారత్ నెగ్గడం విశేషం. భారత్ తరఫున జుగ్‌రాజ్ సింగ్ (18వ నిమిషంలో), అభిషేక్ (27వ నిమిషంలో), రాజిందర్ సింగ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు హెజ్డెన్ (19వ నిమిషంలో), బిజెన్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం లండన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు) జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో.. సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..? మాట మార్చింది నువ్వు.. డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..? ఆ రోజు ఏం చెప్పారు