
నందమూరి అభిమానులు గత కొన్నేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడతాడని భావించిన మోక్షు ఎంట్రీపై ఇప్పుడు మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల వారసులు 25 ఏళ్ల వయసు వచ్చేసరికే ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. కానీ మోక్షజ్ఞ ఇప్పటికే 30 ప్లస్‌లోకి అడుగుపెట్టినా ఆయన సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. దీంతో అసలు మోక్షజ్ఞకు యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో మోక్షజ్ఞ తన లుక్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని బరువు తగ్గి, స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ సంబరపడేలోపే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. శనివారం మోక్షజ్ఞ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ మోక్షజ్ఞను చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. ఆ మధ్య సన్నబడిన మోక్షు.. ఇప్పుడు మళ్లీ వెయిట్ పుటప్ చేసి కనిపించారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మోక్షు, తన ఫిజిక్‌ను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాడనే చర్చ అభిమానుల్లో మొదలైంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అనుకున్న ప్రాజెక్ట్‌లు కూడా ఏవీ వర్కవుట్ కావడం లేదు. మొదట ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని అధికారికంగా ప్రకటనలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిందని భావించిన ఈ ప్రాజెక్ట్ అసలు సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగింది. ఆ తర్వాత బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చిత్రంతో మోక్షు నటిస్తాడని తానే స్వయంగా దీనికి దర్శకత్వం వహిస్తానని బాలయ్య ప్రకటించారు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్న క్రిష్.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేయడంతో ఈ ప్లాన్ కూడా పక్కకు వెళ్ళింది. ఇలా దర్శకులు మారుతున్నా, కథలు మారుతున్నా నందమూరి వారసుడి