నితీష్ అవుట్.. టీమిండియాలోకి సూర్యాంశ్ షెడ్జ్
Actor ProfileCelebrity

నితీష్ అవుట్.. టీమిండియాలోకి సూర్యాంశ్ షెడ్జ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నితీష్ అవుట్.. టీమిండియాలోకి సూర్యాంశ్ షెడ్జ్
SkyC Media7 Jul 2026
నితీష్ అవుట్.. టీమిండియాలోకి సూర్యాంశ్ షెడ్జ్

భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంతో రాబోయే టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ ముంబైకి చెందిన స్టార్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్జ్ వైపు మొగ్గు చూపింది. జూన్ 23న బీసీసీఐ ఈ కీలక మార్పును అధికారికంగా ప్రకటించింది. గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఈ 23 ఏళ్ల యువ క్రికెటర్ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత జట్టులో చేరాడు. ఇదిలా ఉండగా జూన్ 20న అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడి ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఫలితంగా బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేరకు ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహ్యాబ్‌లో చేరాడు. ఈ నేపథ్యంలోనే లండన్ టూర్‌లో జరిగే కీలకమైన టీ20 సిరీస్‌లకు నితీష్ పూర్తిగా అందుబాటులో ఉండటం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ సిరీస్‌ల కోసం ఎంపికైన సూర్యాంశ్ షెడ్జ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై తరపున, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ఇండియా-ఏ తరపున శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో సూర్యాంశ్ అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అక్కడ ఆడిన 5 మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 147 రన్స్ చేయడంతో పాటు 23 ఓవర్ల బౌలింగ్ కూడా చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సూర్యాంశ్ ఆడిన ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఆ టోర్నీలో ఏకంగా 251 స్ట్రైక్ రేట్‌తో 131 రన్స్ చేసి అత్యుత్తమ ఎక్స్‌ప్లోసివ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్ 2025