నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు
Actor ProfilePolitician

నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం
Zee Telugu18 Jun 2026
నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Telangana Road Accidents Today: తెలంగాణ లింగాల ఘనపూర్‌లో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని మేడ్చల్‌ పీఎస్‌ పరిధిలో కూడా మురహరిపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై మరో యాక్సిడెంట్‌ జరిగింది.. ఈ రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌ మండలం, నెల్లుట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పంక్షర్‌ కావడంతో రోడ్డు పక్కనే ఒక మినీ ట్రక్కును ఆపి రిపెయిర్‌ పనులు చేపట్టారు. చీకటిగా ఉండటంతో ఒక్కసారిగా వెనుకవైపు నుంచి వచ్చిన లారీ ఒక్కసారిగా ఆ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. ఘట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. మరో ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు కూడా మృతి చెందారు. ఈ ప్రమాదంలో చనిపోయింది రోహిత్‌, రాజేందర్‌, మధుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయంలో అతివేగం, అజాగ్రత్తగా ఉండటంతో ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మినీ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు చనిపోయారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో వారి మృతుల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, పోలీసుల ప్రకారం లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి దర్యాప్తు కూడా