నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
Actor ProfilePolitician

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

Total News1
Movie Updates0
Sources1
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
Telugu Times17 Jun 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులకు ఈ ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి-నిడమర్రు రోడ్డు వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మాణం మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు. సమస్య శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరుకు కృషిచేశారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన, నిరంతరాయ రవాణ అనుసంధానాన్ని కల్పిస్తుంది. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతుంది. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్ లో ఈ ప్రాంతంలో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. రైల్వే క్రాసింగ్ గేటు ద్వారా రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణిస్తాయి. రోజుకు