నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
Actor ProfileActor

నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
Sakshi27 Jul 2026
నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్

ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. తన సొంత గ్రామంలోనే సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. కేవలం మూడు నెలల్లోనే విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇది. శ్రీలంకకు చెందిన సమీత సులక్కన అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్న తన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. కంపెనీలో జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు. ఐటీ ఉద్యోగం నుండి వ్యాపారం వైపు.. సమీత సులక్కన తన విజయ గాథను లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించారు. దీని ప్రకారం ఇటీవల కంపెనీలో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు సమిత. మిగిలిన వారిలాగే భవిష్యత్తుపై ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. టెకీలకు ఐటీ రంగంలోనే కెరీర్ ఉంటుందని భావించాడు. పైగా ఐటీ అనేది ప్యాషన్. కానీ, ఆ కష్టకాలంలో అవకాశాలు ఎప్పుడూ మనం అనుకున్న రూపంలోనే రావని చాలా తొందరగానే గ్రహించాడు. అందుకే మరో టెక్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా, తన గ్రామంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించే ఒక మినీ సూపర్ మార్కెట్ కూడా లేదని గమనించి, ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని స్వయంగా ఒక స్టోర్‌ను ప్రారంభించాడు. సంప్రదాయ వ్యాపారానికి టెక్నాలజీ హంగులు తాను చదువుకున్న చదువును, టెక్నాలజీ నేపథ్యాన్ని తన వ్యాపారంలో ఉపయోగించాలని సమిత నిర్ణయించుకున్నాడు. సాధారణ కిరాణా దుకాణంలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. కస్టమర్ల సౌకర్యం కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) సదుపాయంతో కూడిన ఒక సాధారణ ఆన్‌లైన్ ఆర్డరింగ్ విధానాన్ని ఆయనే స్వయంగా డెవలప్ చేసుకున్నాడు. దీనివల్ల కస్టమర్లు ఇంట్లో