
శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ: శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం శిల్ప కళా వేదికకు వస్తున్న నేపథ్యంలో మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 5వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారులపై వాహన రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్ పరిసరాలు, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ జామ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు