
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Cabinet Meet Telangana: మరికాసేట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ- కేబినెట్ భేటీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీ మూసీ పునరుజ్జీవనం ఫేజ్1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కేబినెట్ భేటీకి సర్కార్ ఏర్పాట్లు.. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ-రామ్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెట్రోరైలుకు ఉన్న అడ్డంకులతో పాటు ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు అంశాలపై క్యాబినేట్ చర్చించనుంది. తొలిసారి పేపర్ లెస్ మంత్రవర్గం సమావేశం జరగబోతూ ఉండటం పై ఆసక్తి నెలకొంది. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా మంత్రవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంత రాష్ట్ర బదిలీలపై కూడా