
SBI PO Recruitment 2026: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,500 ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 18న ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2026 జూలై 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసిన అభ్యర్థులు ఎస్‌బీఐ కెరీర్స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా కొన్ని నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇక అభ్యర్థుల వయస్సు 2026 ఏప్రిల్ 1 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది). ఉద్యోగ ఎంపిక కోసం ఎస్‌బీఐ మూడు దశల కఠినమైన పరీక్షా విధానాన్ని ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ. బ్యాంకింగ్ ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులు ఈ క్రింది కీలకమైన తేదీలను గమనించాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు క్రింది సాధారణ దశలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు: Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం.. జూన్ 29న హైకోర్టు డెడ్‌లైన్‌పై ఉత్కంఠ! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Uddhav Thackeray : ఉద్ధవ్ సేనలో మరోసారి భారీ చీలిక: ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు గైర్హాజరు! Tata Motors: వాహనదారులకు