
హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో (National Eligibility Cum Entrance Test) మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాష్‌రూమ్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో ఫోన్ దాచిపెట్టి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్ష కేంద్రంగా ఉన్న రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు విద్యార్థి పరీక్ష ప్రారంభానికి చాలా ముందుగానే చేరుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో కేంద్రంలోకి ఆ విద్యార్థి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌ను జిప్‌లాక్ కవర్‌లో భద్రపరచి వాష్‌రూమ్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో దాచాడు. వాష్‌రూమ్ వెంటిలేటర్ ద్వారా ఫోన్‌ను లోపలికి చేర్చాడు. పరీక్ష కేంద్రంలో భద్రతా తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించినప్పటికీ, ఉదయం 6 గంటలకు, 11 గంటలకు సిబ్బంది జరిపిన రెండు విడతల తనిఖీల్లో ఫ్లష్ ట్యాంక్‌లో దాచిన మొబైల్ ఫోన్‌ను గుర్తించలేకపోయారు. దీంతో విద్యార్థి తన ప్రణాళికను అమలు చేయగలిగాడు. పరీక్ష జరుగుతున్న సమయంలో కడుపు నొప్పి ఉందని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థి, ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపి తనిఖీ చేయించగా, వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ గూగుల్ క్రోమ్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న సమయంలో అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా సమాధానాలు వెతికి.. సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని