
TG EAPCET 2026 Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం (ఈరోజు) నుంచే అధికారికంగా ప్రారంభమైంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. Read Also: Rythu Bharosa Update : ‘రైతు భరోసా’.. మొదట వారి ఖాతాల్లోకే! రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన 1,44,704 మంది విద్యార్థుల కోసం సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 హెల్ప్‌లైన్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది కొత్తగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో కూడా ప్రత్యేక కేంద్రాన్ని కేటాయించినట్లు ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు దక్కించుకోవాలనుకునే వారికి ధ్రువపత్రాల పరిశీలన అత్యంత కీలకం. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వారికి మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అర్హత లభిస్తుంది. జూన్ 25వ తేదీ నుంచి విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు. గత ఏడాది కన్వీనర్ కోటాలో సుమారు 92 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది కాలేజీల వారీగా స్పష్టమైన సీట్ల వివరాలు జూన్ 24వ తేదీ నాటికి తేలనున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా 90 వేల నుంచి 95 వేల మంది కౌన్సెలింగ్‌కు హాజరవుతుండగా.. దాదాపు 80 వేల మందికి పైగా సీట్లు పొందుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మొదటి విడత కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి: ప్రభుత్వం అందించే