
APL 5 : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 నేటి నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. నేటి (బుధవారం జూన్ 24) నుంచి వారం రోజుల పాటు అంటే ఈ నెల 30 వరకు ఈ టోర్నీ సాగనుంది. ఇక ఈ సీజన్ ప్రారంభ వేడుకలకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రామ్‌చరణ్ రాకతో మైదానంలో సరికొత్త జోష్ నిండనుండగా, ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకనున్నాయి. Ranchi : రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నారంటే? ఏపీఎల్ సీజన్ 5లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నయి. ఇందులో 8 లీగ్ మ్యాచ్‌లు కాగా మూడు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్ ఉంది. తొలి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ వర్సెస్ సింహాద్రి వెజాగ్ లయన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనుంది. ఇక సాయంత్రం భీమవర బుల్స్ వర్సెస్ క్యాపిటల్ అమరావతి రాయల్స్‌ల మధ్య జరగనుంది. తొలిసారి మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఏపీఏల్ మ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాగునీరు, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేశారు