.webp)
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నా.. భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతుంది. తాజాగా భారత జీడీపీ రేటు 7.7 శాతంగా నమోదైంది. దీంతో భారత్ ఆర్థికంగా బలంగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి. 2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ (WIL) నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారు 20 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండోర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ‘గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్: ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానెటరీ బౌండరీస్’ నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు. దాని ప్రకారం 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23 శాతం ఉండగా.. 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. 2100 నాటికి ఇది 8 శాతం కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది. జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్‌లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది. 21వ శతాబ్దంలో