నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా
Actor ProfilePolitician

నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా
Sakshi5 Jul 2026
నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా

కర్నూలు : గంగమ్మ పోలీసు కస్టడీ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప బెయిల్‌ పిటీషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం జిల్లా కోర్టులో జరిగిన విచారణలో దర్గప్ప తరపు న్యాయవాది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు మేజి్రస్టేట్‌ పోలీసు కస్టడీలోని దర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పోలీసు పహరా మధ్య పోలీసు సదన్‌లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎవరినీ కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్గప్ప ఆరోగ్యం, ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసును ఎలాంటి మలుపు తిప్పుతుందోననే చర్చ కొనసాగుతోంది. హత్యోదంతంలో మరొకరు ఎవరు? కుమారుని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసు విచారణలో గంగమ్మ మృతి చెందడం తెలిసిందే. విచారణ సందర్భంగా సిట్‌ పోలీసులు కొట్టడం వల్లే ఆమె మరణించినట్లు పత్రికల్లో విరుస కథనాలు వెలువడ్డాయి. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే తన తల్లి కిందపడటం వల్లే మరణించినట్లు గంగమ్మ కుమార్తెతో పోలీసులు రాతపూర్వకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కుమారుడి హత్యోదంతంలో గంగమ్మ, దర్గప్పతో పాటు మరొకరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు మరొకరు ఎవరనే విషయాన్ని కూడా వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 22 రోజులుగా పోలీసుల ఆధీనంలోనే! సిట్‌ పోలీసుల విచారణ ఇప్పటికే వివాదాస్పదం కావడం తెలిసిందే. గంగమ్మ మృతి, దర్గప్ప ఆసుపత్రి పాలవడం చూస్తే ఏస్థాయిలో తమదైన శైలిలో విచారణ చేపట్టారో అర్థమవుతోంది. హైకోర్టు దర్గప్ప వాంగ్మూలాన్ని కోరడంతో పోలీసులు ఆయనను ఏమైనా భయపెట్టి ఉంటారేమోనని చర్చ జరుగుతోంది. గంగమ్మ మరణం వెనుక మిస్టరీని దర్గప్ప నిర్భయంగా బయటపెట్టగలడా? లేక తనను కూడా ఏమైనా చేస్తారేమోనని పోలీసుల స్క్రిప్టుతో