నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్
Actor ProfilePolitician

నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్
Andhra Jyothy21 Jun 2026
నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్‌ ‘పాలిసెట్‌-2026’లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ‘పాలిసెట్‌-2026’లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. ఈనెల 24 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌, ఫీజుల చెల్లింపు, రిజిస్ర్టేషన్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరించబడని లేదా మార్పులు అవసరమైన సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం ఈనెల 25 నుంచి జూలై ఒకటో తేదీ వరకు నోటిఫైడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్లలో హాజరుకావాలి. 29 నుంచి జూలై 3 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను పెట్టుకోవాలి. జూలై 4న వెబ్‌ ఆప్షన్ల మార్పు, 6న సీట్ల కేటాయింపులు కాగా, 7 నుంచి 10 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూలై 7 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం, యూజర్‌ మాన్యువల్‌తోపాటు సవివరమైన సూచనలు లో అందుబాటులో ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని ఏపీ పాలిసెట్‌-2026 అడ్మిషన్స్‌ కన్వీనర్‌ సూచించారు