EPFO Claim Settlement: ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఈపీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత వేగంగా పరిష్కారం కానున్నాయి. పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ, పెన్షన్ ఫిక్సేషన్ వంటి వాటికి టైమ్ లిమిట్ నిర్దేశించింది. అలాగే ఈపీఎఫ్ 1952, ఈపీఎస్-1995, ఈడీఎల్ఐ-1976 పథకాల స్థానంలో సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026, ఉద్యోగుల పింఛను పథకం 2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం 2026ను లాంచ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశింది. ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ నిర్ణయించడం, బీమా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక నుంచి అర్హత గల క్లెయిమ్‌లను ఎలాంటి సహేతుక కారణాలు లేకుండా 20 రోజుల్లోగా పరిష్కారం చేయకపోతే సంబంధిత ఈపీఎఫ్ఓ కమిషన్ పై ఏకంగా 12 శాతం పెనాల్టీ వేయనున్నారు. క్లెయిమ్ మొత్తంపై విధించే వడ్డీని సదరు అధికారి జీతం నుంచి కట్ చేసి క్లెయిమ్ చేసిన ఉద్యోగికి పరిహారంగా చెల్లించనున్నారు. పేమెంట్ల ఆలస్యానికి పరిహారం చెల్లించే రూల్ గత పథకాల్లోనూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో నిర్ణయించిన వడ్డీ మొత్తం చెల్లించే రూల్ ఉండగా ఇప్పుడు 12 శాతంగా నిర్ణయించినట్లు తెలిపారు. కోడ్ అనుసరించి కొత్త పథకాలను నోటిఫై చేయడం మినహా ఈపీఎఫ్ఓ, ఈపీఎఫ్ పథకాలలో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ సేవల్ ఆన్‌లైన్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండేలా రూల్స్ పొందుపరిచింది. ఎంప్లాయర్లు, ఈపీఎఫ్ఓ ఆఫీసులు, ఈపీఎఫ్ఓ నుంచి మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులన్నీ క్లెయిమ్‌ల దాఖలు కోసం మెంబర్లకు ఆన్‌లైన్ సదుపాయాలను తప్పనిసరి కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈపీఎఫ్ నుంచి ఏడాదికి 2 కన్నా ఎక్కువ పాక్షిక ఉపసంహరణలు చేయకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 2 సార్లే విత్‌డ్రాఎప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్
Actor ProfilePolitician
నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Sept 2026
నుంచి 3 కొత్త స్కీమ్స్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్, అధికారులకు షాక్.. ఇక 20 రోజుల్లోనే చేతికి డబ్బులు